స్థానిక పోరుతో జిల్లాలో రెండు రోజులు బస్సులు బంద్

రిపోర్టర్: JR RAO స్థలం: శ్రీకాకుళం

జిల్లాలో ఈ నెల ఐదున జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు రెండు వందల అరవై ఆర్టీసీ బస్సులను కేటాయించినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పల నారాయణ మంగళవారం ప్రకటనలో తెలిపారు. దీంతో ఈ నెల నాలుగు, ఐదు తేదీల్లో జిల్లాలోని ప్రధాన మార్గాల్లో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.