అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కుసుమంచి

కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని, గత ప్రభుత్వం కమీషన్ల కోసం కాళేశ్వరం నిర్మించిందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష నియోజకవర్గాల్లోనూ సమానంగా ఇళ్లు ఇస్తున్నామని స్పష్టం చేశారు.