మంటల్లో పూర్తిగా కాలి బూడిదైన పూరింటి బతుకులు

రిపోర్టర్: k. siva prasad స్థలం: చిట్వేల్

తిరుపతి జిల్లా చిట్వేల్ మండల కేంద్రంలోని సింగనమల వీధిలో గురువారం టంగుటూరి మస్తాన్ కు చెందిన పూరిల్లు ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలను చూసి అప్రమత్తమైన స్థానికులు వాటిని ఆర్పివేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో రాజంపేట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.