స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లకు బీఐఎస్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసిన కేంద్రం

రిపోర్టర్: హరి స్థలం: భారతదేశం

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక భద్రతా ప్రమాణాల నిబంధనను తీసుకువచ్చింది. మార్కెట్‌లో లభించే స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా పూర్తిగా అమల్లోకి రానున్నాయని, దీనివల్ల నాణ్యమైన ఉత్పత్తులు మాత్రమే మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు.