శ్రీకృష్ణుడిపై వ్యాఖ్యల దుమారం: భక్తులకు బహిరంగంగా క్షమాపణలు తెలిపిన బాఘేశ్వర్ బాబా
రిపోర్టర్: శివ
స్థలం: Madhya Pradesh
శ్రీరాముడు, శ్రీకృష్ణ భగవానుడిని పోలుస్తూ తాను చేసిన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని బాఘేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర శాస్త్రి స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లా కరేరాలో రామకథ చెబుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవ్వడం, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ చర్యలకు డిమాండ్ చేయడంతో ఆయన వెనక్ కి తగ్గారు. భక్తుల మనోభావాలు దెబ్బతిని ఉంటే బేషరతుగా క్షమాపణలు కోరుతున్నట్లు ధీరేంద్ర శాస్త్రి వీడియో ద్వారా వెల్లడించారు.