రాజస్థాన్‌లో బీజేపీ అభ్యర్థికి కేవలం ఒక్క ఓటు మాత్రమే!

రిపోర్టర్: రాము స్థలం: రాజస్థాన్

రాజస్థాన్‌లోని పర్బత్సర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కైలాష్ చంద్రకు కేవలం ఒక్క ఓటు మాత్రమే రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. 13వ వార్డులో పోటీ చేసిన ఆయనకు స్థానికంగా ఓటు లేకపోవడం, కుటుంబ సభ్యులందరూ వేరే వార్డు ఓటర్లు కావడంతో ఈ పరిస్థితి ఎదురైంది. కాంగ్రెస్ అభ్యర్థి 376 ఓట్లతో ఘన విజయం సాధించగా, జాతీయ పార్టీ అభ్యర్థికి ఒక్క ఓటు రావడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.