దేశ ప్రగతి కోరుతూ దీపకాంతులతో ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో భాజపా ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి చినుకని మల్లేష్ యాదవ్ ఇంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆశీర్వాద దీపం వెలిగించారు. ఈ సందర్భంగా మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం మరింత సేవ చేసే అవకాశం కలగాలని కోరుకున్నారు.