స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు: బీఆర్ఎస్కు భారీ సెల్ఫ్ గోల్!
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
అసెంబ్లీ సమావేశాల తొలిరోజే బీఆర్ఎస్ వ్యూహాత్మక తప్పిదంతో ఆత్మరక్షణలో పడింది. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనకు వెళ్లిన గులాబీ పార్టీకి, గేటు వద్ద ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు భారీ సెల్ఫ్ గోల్ అయ్యాయి. సభా గౌరవాన్ని దిగజార్చేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించగా, కాంగ్రెస్ నేతలు మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసి తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.