అణు సామర్థ్యంతో కొత్త డిస్ట్రాయర్‌ను ప్రారంభించిన కిమ్ జోంగ్ ఉన్

రిపోర్టర్: సురేష్ స్థలం: World

ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న 'కాంగ్ కోన్' కొత్త డిస్ట్రాయర్ నౌకను జాతికి అంకితం చేశారు. వోన్సాన్ నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, శత్రువుల నుంచి ముప్పు ఎదురైతే చావుదెబ్బ రుచిచూపిస్తామని హెచ్చరించారు. నావికాదళాన్ని పూర్తిగా అణు సాయుధ శక్తిగా మారుస్తామని, త్వరలోనే మరో భారీ ప్రణాళికను ప్రపంచానికి చూపిస్తామని స్పష్టం చేశారు.