మొరాకన్ ఆయిల్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా టెన్నిస్ స్టార్ అర్యనా సబలెంక

రిపోర్టర్: అశోక్ స్థలం: World

ప్రముఖ టెన్నిస్ స్టార్, బెలారస్‌కు చెందిన అర్యనా సబలెంక ప్రముఖ హెయిర్‌కేర్ బ్రాండ్ మొరాకన్ ఆయిల్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుని గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. 2026 యూఎస్ ఓపెన్ టోర్నమెంట్‌లో ఎెలెనా రిబాకినా చేతిలో ఓటమిపాలైన కొద్ది రోజులకే ఆమె ఈ మల్టీ మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని దక్కించుకున్నారు. కోర్టు వెలుపల ఒప్పందాల ద్వారా భారీగా ఆర్జిస్తున్న సబలెంక, త్వరలో జరగనున్న చైనా ఓపెన్ మరియు మయామి ఓపెన్ టోర్నమెంట్ల కోసం సిద్ధమవుతున్నారు.