గురుకుల కళాశాలలో అంబెడ్కర్ విగ్రహ ఆవిష్కరణ వేడుక
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల సీఈఓలో పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శనివారం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి రాజేష్, పేరెంట్స్ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాల ప్రిన్సిపాల్ విద్యాసాగర్, ఉపాధ్యాయులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.