స్థానిక ఎన్నికలు అభివృద్ధికి అవినీతికి మధ్య జరుగుతున్న పోరు: ఎమ్మెల్యే సోమిరెడ్డి

రిపోర్టర్: శివ స్థలం: సొల్లుపల్లి

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు అభివృద్ధికి, అవినీతికి మధ్య పోరు అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పొదలకూరు మండలం మర్రిపల్లి గ్రామంలో సోమవారం ఆయన ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పొదలకూరు జడ్పీటీసీ స్థానంతో పాటు అన్ని స్థానాల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని తీవ్రంగా ఆరోపించారు.