ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ సమరభేరి: హైదరాబాద్లో భారీ సభకు సన్నాహాలు

రిపోర్టర్: రమేష్ స్థలం: Hyderabad

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లో సుమారు రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభ, మార్చ్ నిర్వహించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ పోరాటాన్ని రాష్ట్రంలోనూ విస్తృతంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు.