భక్తిశ్రద్ధలతో వినాయక పూజ

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామంలో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ వినాయక స్వామి పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు దేప శ్యాంసుందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, గ్రామంలో శాంతిభద్రతలు ఐకమత్యం వెల్లివిరియాలని స్వామివారిని ప్రార్థించినట్లు శ్యాంసుందర్ తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.