నర్సంపేటలో దసరా వేళ అమాంతం ఎగబాకిన పూల ధరలు
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
దసరా పండుగ వేళ పూల ధరలు సామాన్యులకు భారంగా మారాయి. బతుకమ్మ వేడుకలు, పండుగ పూజల నేపథ్యంలో పూలకు గిరాకీ పెరగడంతో ధరలు అమాంతం ఎగబాకాయి. సాధారణ రోజుల్లో బంతి పూలు కిలో రూ.50 ఉండగా ప్రస్తుతం రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. పూల ధరలు రెట్టింపు కావడంతో మధ్య తరగతి కుటుంబాలు కొనుగోలుకు వెనుకాడుతున్నాయి. పండుగ వేళ పూలు కొనాలంటే జేబుకు చిల్లు పడుతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.