అమెరికాలో అతిపెద్ద ఆసియా జనాభా సమూహంగా భారతీయులు: అధికారిక లెక్కలు వెల్లడి
రిపోర్టర్: రమేష్
స్థలం: అమెరికా
అమెరికా జనాభా లెక్కల సంస్థ విడుదల చేసిన తాజా అమెరికన్ కమ్యూనిటీ సర్వే అంచనాల ప్రకారం, 2025 నాటికి యునైటెడ్ స్టేట్స్ లో ఆసియా భారతీయుల సంఖ్య సుమారు 54.1 లక్షలకు చేరింది. ఈ క్రమంలోనే అమెరికాలో అతిపెద్ద ఆసియా జనాభా సమూహంగా భారతీయులు అవతరించారని అమెరికా జనాభా లెక్కల సంస్థ అధికారులు అధికారికంగా వెల్లడించారు. ఈ జనాభాలో కాలిఫోర్నియా, టెక్సాస్ రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలిచాయి.