అమరావతి రాజధానిలో వరద ముప్పు నివారణకు కరకట్ట పనులు ముమ్మరం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అనకాపల్లి
అమరావతి రాజధాని ప్రాంతంలో వరద ముప్పును సమర్థవంతంగా తగ్గించేందుకు కరకట్ట బలోపేత పనులు వేగంగా కొనసాగుతున్నాయని వంగలపూడి అనిత అనకాపల్లి వెల్లడించారు. కరకట్ట పటిష్టీకరణతో పాటు కీలకమైన రహదారి అభివృద్ధి పనులను చేపడుతూ రాజధాని ప్రాంతానికి మరింత భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అమరావతి సమగ్ర అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతుల బలోపేతానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజల రక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.