'నేరాల నియంత్రణే లక్ష్యం': రాజంపేట ఎన్‌టీఆర్ కాలనీలో పోలీసుల గ్రామసభ
రిపోర్టర్: విజయ్
స్థలం: Rajampet
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు రాజంపేట పట్టణంలోని ఎన్‌టీఆర్ కాలనీలో పోలీసులు గ్రామసభ నిర్వహించారు. పట్టణ ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసు శాఖ తరఫున ఈ అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.