మెగా డీఎస్సీ ఫైలుపైనే మొదటి సంతకం చేశా: చంద్రబాబు నాయుడు

రిపోర్టర్: అశోక్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ ఫైలుపైనే మొదటి సంతకం చేశానని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. ఉపాధ్యాయులను కించపరిచేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకుని ఉన్నత లక్ష్యాల వైపు పయనించాలని ఆయన పిలుపునిచ్చారు.