రెండున్నరేళ్లలో 36 నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: చంద్రబాబు

రిపోర్టర్: గోపి స్థలం: అమరావతి

రాష్ట్రంలో 36 నీటి ప్రాజెక్టులను రూ.35,315 కోట్లతో రాబోయే రెండున్నరేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రాజెక్టుల పూర్తికి క్యాలెండర్ సిద్ధం చేశామని, లక్ష్యానికి ముందే పూర్తి చేసే గుత్తేదారులకు బోనస్, అధికారులకు అవార్డులు అందజేస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సులో జలవనరుల పరిస్థితిపై ఆయన సమీక్ష నిర్వహించారు.