కాంగ్రెస్ పాలనలో ఇండ్లు కూల్చుతున్నారంటూ ఖమ్మం బాధితుడి ఆవేదన
రిపోర్టర్: మహేష్
స్థలం: Khammam
ఖమ్మం శ్రీనివాసనగర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై స్థానిక బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకోమంటే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు కూల్చేస్తోందని మండిపడ్డారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తమ బాధలు పట్టించుకోకుండా హైదరాబాద్‌లోనే ఉంటున్నారని విమర్శించారు. మళ్లీ కేసీఆర్ వస్తేనే తమ ఇండ్లు తమకు దక్కుతాయని బాధితుడు కన్నీటిపర్యంతమయ్యారు.