మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్దచెరువు వద్ద పోలీసుల భారీ బందోబస్తు
రిపోర్టర్: హరి
స్థలం: మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్దచెరువు వద్ద సాగునీటి కోసం రైతులు ఆందోళనకు దిగకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. పంటలు ఎండిపోతున్నాయని తూముల ద్వారా నీళ్లు పారించుకుంటున్న రైతులను అడ్డుకునేందుకు పోలీసులు గస్తీ కాస్తుండటం కాంగ్రెస్ సర్కార్ అణచివేత ధోరణికి నిదర్శనంగా నిలుస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది.