టీడీపీకి ఏ పార్టీ సాటి రాదు: జయరాం కోమటి
రిపోర్టర్: కిరణ్
స్థలం: అమెరికా
టీడీపీకి దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా సాటి రాదని అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి అన్నారు. 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పార్టీని పటిష్టం చేయడంలో ప్రవాసాంధ్రులు కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు నాయకత్వానికి ప్రభావితమై పార్టీలో చేరానని, అమెరికాలో ఉన్నా ఎన్నారైలు ఎప్పుడూ టీడీపీకి అండగా ఉంటారని స్పష్టం చేశారు.