ఒమన్ తీరంలో నౌకపై దాడి: అప్రమత్తమైన 27 మంది భారతీయ సిబ్బంది

రిపోర్టర్: సతీష్ స్థలం: ఒమన్ తీరం

ఒమన్ తీరంలో దుబాయ్కు చెందిన ఎంటీ లూయిస్ నౌక ఇంజిన్ రూమ్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఆ సమయంలో నౌకలో మొత్తం ఇరవై ఏడుగురు భారతీయ సిబ్బంది ఉన్నారని, వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదానికి లింపెట్ మైన్స్ దాడి కారణమని అనుమానిస్తున్నారు. సముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.