భగత్‌సింగ్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలన్న ఏఐవైఎఫ్
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
భగత్‌సింగ్ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఏఐవైఎఫ్ పిలుపునిచ్చింది. హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణ రెడ్డి భవన్ వద్ద భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసి నివాళులు అర్పించారు. భగత్‌సింగ్ రచనలు, ఆలోచనలను నేటి యువత తప్పకుండా అధ్యయనం చేయాలని నాయకులు కోరారు. జిల్లా, మండలాలు, విద్యాసంస్థల్లో ప్రత్యేక చర్చలు, పుస్తక ప్రదర్శనలు, యువజన సదస్సులు నిర్వహించాలని ఏఐవైఎఫ్ పిలుపునిచ్చింది.