'రాత పరీక్ష లేకుండా ఉద్యోగమా?.. ఈ వింత సంస్కృతేంటి బాబూ?': వైసీపీ నేత సలాం బాబు ఫైర్
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
దేశంలో ఎక్కడా లేని విధంగా రాత పరీక్ష లేకుండా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకాలు చేపట్టడంపై వైసీపీ రాష్ట్ర యూత్ ఎంపవర్మెంట్ సెల్ కన్వీనర్ సలాం బాబు కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒడిశా, పంజాబ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో పరీక్ష నిర్వహించి భర్తీ చేస్తుంటే, ఏపీలో మాత్రం అకడమిక్ మెరిట్ ప్రకారం ఇస్తామని జీవో ఇవ్వడం వెనుక ఆంతర్యమేంటని ఆయన నిలదీశారు.