తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీగా ప్రధాని ఆవాస్ ఇళ్ల మంజూరు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: న్యూఢిల్లీ
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం 3,46,544 కొత్త ఇళ్లను మంజూరు చేసింది. ఏపీకి 2,25,788 మరియు తెలంగాణకు 1,20,756 ఇళ్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు రాష్ట్రాలకు కేటాయించిన మొత్తం ఇళ్ల సంఖ్య 5 లక్షలకు చేరిందని ఆయన వెల్లడించారు.