సినిమా అప్డేట్: లోమేష్ పుడిపెద్ది, జయశ్రీ జంటగా డ్యూ డేట్ షూటింగ్ ప్రారంభం

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

లోమేష్ పుడిపెద్ది, జయశ్రీ జంటగా ఆనంద్ కే దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్యూ డేట్ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం ప్రారంభమైందని నిర్మాతలు పవన్ తరిగోపుల, ఏలూరు శ్రీనులు తెలిపారు. ప్రస్తుత బర్నింగ్ ఇష్యూ ఆధారంగా కోర్ట్ రూమ్ డ్రామాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు వారు వెల్లడించారు. నేటి నుంచి పదిహేను రోజుల పాటు ఏకధాటిగా తొలి షెడ్యూల్ జరగనుందని, ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందనే పూర్తి నమ్మకం ఉందని చిత్ర యూనిట్ పేర్కొంది.