కాలిఫోర్నియాలో వినియోగదారుల విద్యుత్ బిల్లులపై క్లైమేట్ క్రెడిట్ల జమ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: కాలిఫోర్నియా
కాలిఫోర్నియాలో విద్యుత్ వినియోగదారులకు వేసవి భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల విద్యుత్ బిల్లులలో ఆటోమేటిక్ క్రెడిట్లను జమ చేసినట్లు గవర్నర్ గావిన్ న్యూసమ్ కార్యాలయం ప్రకటించింది. పీజీఅండ్ఈ, ఎస్ఈసీ, ఎస్డీజీఅండ్ఈ వినియోగదారులకు మొత్తం 886 మిలియన్ డాలర్ల క్లైమేట్ క్రెడిట్లు అందుతున్నాయి. ఎలాంటి దరఖాస్తు లేకుండానే నేరుగా అర్హులైన గృహాల బిల్లులలో ఈ రాయితీ వర్తింపజేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.