పాకిస్థాన్ ఐఎస్ఐ హానీట్రాప్‌లో చిక్కిన కఠువా ట్రక్ డ్రైవర్
రిపోర్టర్: రాము
స్థలం: Kathua
జమ్ముకశ్మీర్‌లోని కఠువా ప్రాంతంలో పాకిస్థాన్ ఐఎస్ఐ హానీట్రాప్‌లో చిక్కుకుని దేశ భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరించిన ఇరవై నాలుగు ఏళ్ల ట్రక్ డ్రైవర్ అమాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సరిహద్దు ప్రాంతంలో భద్రతా బలగాల కదలికలను నిరంతరం ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు తన ఇంటి వద్ద సిమ్ కార్డ్ ఆధారిత సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేసినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు నిందితుడిపై అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.