ఈ నెల ముప్పైకి థియేటర్లలోకి కిల్లర్: భారీ కాంటెస్ట్ ప్రకటించిన చిత్ర యూనిట్
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
జ్యోతి పూర్వజ్ మరియు పూర్వాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సై ఫై థ్రిల్లర్ చిత్రం కిల్లర్ ఈ నెల ముప్పైవ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో చిత్ర విశేషాలను పంచుకున్న నటీనటులు, దర్శకుడు ప్రేక్షకుల కోసం కోటి రూపాయల ప్రత్యేక కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో కీలకమైన ట్విస్టులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని వారు ధీమా వ్యక్తం చేశారు.