కృష్ణా నదిలో త్వరలో పర్యాటకులకు లగ్జరీ హౌస్‌బోట్ సేవలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: Vijayawada
కృష్ణా నదిలో పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచేలా లగ్జరీ హౌస్బోట్లు, పార్టీ క్రూజ్లను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు. సుమారు ముప్పై కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని అధికారులు తెలిపారు. కేరళ, కాశ్మీర్ తరహాలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ బోట్లలో బస, విందు వినోదాల సౌకర్యాలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.