షాకింగ్ ఘటన: నోయిడా మాల్లో నెయ్యి, నూనె డబ్బాలు దొంగిలిస్తున్న మహిళ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: నోయిడా
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్ పద్దెనిమిదిలో ఉన్న డీఎల్ఎఫ్ మాల్లో ఒక మహిళ నెయ్యి, రిఫైన్డ్ ఆయిల్ బాటిల్స్‌ను చోరీ చేస్తూ సిబ్బందికి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిందని మాల్ వర్గాలు తెలిపాయి. చూసేందుకు ఉన్నత కుటుంబానికి చెందినట్లుగా ఉన్న ఆ మహిళ, బ్యాగ్‌లో సరుకులు పెట్టి రహస్యంగా బయటకు వెళ్తుండగా సీసీటీవీ ద్వారా గుర్తించి అడ్డుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.