భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత సంపన్న నటులుగా నలుగురు తెలుగు హీరోలు

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత సంపన్నమైన టాప్-టెన్ నటుల జాబితాలో నలుగురు తెలుగు స్టార్లు చోటు దక్కించుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి. నాగార్జున అక్కినేని ఐదు వేల కోట్ల రూపాయల సంపదతో రెండో స్థానంలో నిలవగా, చిరంజీవి, వెంకటేష్, రామ్ చరణ్ కూడా ఈ అగ్రశ్రేణి జాబితాలో చోటు సంపాదించుకున్నారు. కేవలం సినిమాలే కాకుండా వ్యాపారాలు, పెట్టుబడులు, కుటుంబ ఆస్తుల ద్వారా ఈ భారీ సంపదను సమకూర్చుకున్నట్లు టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.