పెద్దపల్లిలో గంజాయి డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశం
రిపోర్టర్: T. SRAVAN
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లాలో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు స్పష్టం చేశారు. గంజాయి సాగు మరియు డ్రగ్స్ అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. యువతకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన తెలిపారు.