కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఉత్తమ విధానాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

రిపోర్టర్: రాము స్థలం: ఆంధ్రప్రదేశ్

కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో వివిధ జిల్లాల అధికారులు ప్రదర్శించిన ఉత్తమ విధానాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. వినూత్న ఆలోచనలతో కొత్త విధానాలను ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. అల్లూరి జిల్లాలో డ్రోన్ సేవల విస్తరణ, అనంతపురం స్కూల్ స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్, బాపట్ల స్వర్ణ భవిత, చిత్తూరు డిజిటల్ లెర్నింగ్ మోడల్స్ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.