గుంటూరులో కారులో చెలరేగిన మంటలకు వృద్ధుడు సజీవదహనం
రిపోర్టర్: అశోక్
స్థలం: గుంటూరు
గుంటూరు నగరంలో ఐపీడీ కాలనీ సమీపంలో కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో హరికృష్ణ అనే వృద్ధుడు సజీవదహనమయ్యారు. కుమారుడు అఖిలేష్‌తో కలిసి ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని లాలాపేట ఎస్ఐ హసీమ్ తెలిపారు. స్థానికులు అఖిలేష్‌ను రక్షించినప్పటికీ, మంటలు తీవ్రంగా ఉండటంతో వెనక సీట్లో ఉన్న హరికృష్ణను కాపాడలేకపోయారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఏసీ పేలడం లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.