అమెరికాలో వైభవంగా చెస్ టోర్నమెంట్: ఘనంగా దసరా దివాళి వేడుకలు

రిపోర్టర్: అశోక్ స్థలం: California

అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికాన్స్ మరియు బోలీ రేడియో సంయుక్తంగా అక్టోబర్ 17, 2026 న కాలిఫోర్నియాలోని ప్లీజంటన్ వేదికగా బృహత్ చెస్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా నిర్వహించే ఈ పోటీలలో యుఎస్సిఎఫ్ రేటెడ్, నాన్-రేటెడ్ విభాగాలతో పాటు వివిధ స్లాట్లలో ఆటగాళ్లు పాల్గొనవచ్చు. ఈ వేడుకలలో భాగంగా విజేతలకు ప్రతిష్ఠాత్మక ట్రోఫీలు, మెడల్స్ అందజేయడంతో పాటు బాణాసంచా ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.