విద్యార్థులకు అలర్ట్: నవంబర్ 29న క్యాట్ పరీక్ష నిర్వహణ

రిపోర్టర్: హరి స్థలం: తెలంగాణ

నవంబర్ 29న క్యాట్ పరీక్షను నిర్వహించనున్నట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా దాదాపు నూట డెబ్బై నగరాల్ లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఈ పరీక్షలో మొత్తం అరవై ఎనిమిది ప్రశ్నలు ఉంటాయని, రెండు గంటల పాటు పరీక్ష జరుగుతుందని వెల్లడించారు. అభ్యర్థులు చివరి నిమిషంలో చదవాల్సిన సిలబస్ను కాకుండా, ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.