ఈసీ రాజీనామా చేయాలంటూ రాహుల్ గాంధీ తీవ్ర డిమాండ్
రిపోర్టర్: హరి
స్థలం: దిల్లీ
భారత ఓటింగ్ వ్యవస్థను ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ధ్వంసం చేశారని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, దేశానికి వ్యతిరేకంగా ఈసీ పనిచేస్తోందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఓటు చోరీ గురించి ముందే తెలుసని, అన్ని ఎన్నికలు రిగ్గింగ్‌కు గురయ్యాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం ధ్వంసమవుతుంటే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు.