ఇడుపు కాయితం సినిమా నుంచి భావోద్వేగ గీతం విడుదల

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ నేపథ్య కథాంశంతో వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇడుపు కాయితం చిత్రంలోని గడప పాటను శుక్రవారం విడుదల చేశారు. ఈ చిత్రంలో ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తుండగా బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ గీతం ప్రతి స్త్రీ జ్ఞాపకాలను గుర్తుచేస్తుందని నటుడు ప్రియదర్శి తెలిపారు. ఈ సినిమా డిసెంబర్ పదకొండవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.