బిగ్ బాస్ హౌస్‌లో మొదటి రోజే రంజుగా గొడవలు, టాస్క్‌లు!

రిపోర్టర్: కృష్ణ స్థలం: తెలంగాణ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రెండో రోజు హౌస్‌లో వేడి రాజుకుంది. రోహిత్, రామ్‌ప్రసాద్‌ల లీడర్‌షిప్‌లో రెడ్, బ్లూ టీమ్‌లుగా కంటెస్టెంట్స్ విడిపోయారు. హౌస్‌మెట్స్ అర్హతపై జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో ఘర్షణలు చెలరేగాయి. కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడంతో పాటు తొలి రోజు గేమ్‌లు, వాదనలతో హౌస్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.