వినాయక చవితి, దసరా పండుగలకు రైళ్లలో ఫుల్ రద్దీ
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
వినాయక చవితి, దసరా పండుగలకు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో రిజర్వేషన్లు పూర్తిగా నిండిపోయాయి. ఎక్స్ ప్రెస్ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ వందలు దాటి రిగ్రెట్ కు చేరుకుంది. సీట్లు దొరకకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ బస్సుల ధరలు అధికంగా ఉండటంతో, రైల్వే శాఖ వెంటనే స్పందించి ప్రత్యేక రైళ్లు ప్రకటించాలని ప్రయాణికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.