యాదాద్రిలో ఘోర రోడ్డు ప్రమాదం యాచకురాలు మృతి

రిపోర్టర్: రమేష్ స్థలం: యాదాద్రి భువనగిరి

యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈశ్వరమ్మ అనే యాచకురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో అప్రమత్తమైన ఆలయ అధికారులు భక్తుల దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆలయ సంప్రోక్షణ అనంతరం దర్శనాలు పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు.