గిద్దలూరులో నీటి కష్టాలు: మూడ్రోజులకోసారి సరఫరా చేయాలని ఎమ్మెల్యే ఆదేశం
రిపోర్టర్: అశోక్
స్థలం: ప్రకాశం
ప్రకాశం జిల్లా గిద్దలూరు పురపాలక సంఘంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. మూడ్రోజులకోసారి వాడుక నీరు అందించాలని అధికారులను ఆదేశించారు. నల్లమల సాగర్ ద్వారా కృష్ణా జలాలను తరలించి ఏడాదిలోపు శాశ్వత తాగునీటి సమస్య పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు.