గణేష్ నిమజ్జనం వేళ విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో వినాయక చవితి నిమజ్జనోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 25, 2026 న హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సెలవు దినానికి బదులుగా నవంబర్ 14 వ తేదీని పని దినంగా పరిగణించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జూజు వెల్లడించారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.