ఆసియా క్రీడల్లో స్వర్ణాల పంట పండించిన భారత అథ్లెట్లు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: New Delhi
ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరిచారని క్రీడా అధికారులు తెలిపారు. కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో పురుషుల, మహిళల జట్లు మూడు స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నాయి. అలాగే షూటింగ్లో నీరూ ధాండా, కైసన్ చినాయ్ జోడీ మిక్స్డ్ ట్రాప్ ఈవెంట్లో స్వర్తం సాధించారు. భారత ఆటగాళ్ల సమిష్టి కృషితో మొత్తం పతకాల సంఖ్య అరవైకి చేరిందని, పతకాల పట్టికలో భారత్ ఎనిమిదో స్థానానికి ఎగబాకిందని నిర్వాహకులు వెల్లడించారు.