నందన్‌కానన్ జూలో ఒరంగుటాన్ పిల్ల వానరాల ఆరోగ్యం నిలకడ

రిపోర్టర్: సురేష్ స్థలం: భువనేశ్వర్

ఒడిశాలోని బాలేశ్వర్‌లో అటవీ అధికారులు గుర్తించిన ఐదు అరుదైన ఒరంగుటాన్ జాతి వానరాల పిల్లల ఆరోగ్య పరిస్థితి భువనేశ్వర్‌లోని నందన్‌కానన్ జూలో ప్రస్తుతం నిలకడగా ఉంది. గతంలో తీవ్ర రక్తహీనతతో బాధపడిన ఈ ఐదు శిశువులు ఇప్పుడు సాధారణ చురుకుదనం కనబరుస్తున్నాయని, దిల్లీ, దెహ్రాడూన్ నిపుణుల సూచనల మేరకు వాటికి బలవర్ధకమైన ఆహారం అందిస్తూ ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచుతున్నట్లు జూ అధికారులు తెలిపారు.