దుత్తలూరులో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు: డ్రోన్తో గుర్తించి దగ్ధం చేసిన పోలీసులు

రిపోర్టర్: రమేష్ స్థలం: దుత్తలూరు

దుత్తలూరులో కౌలు పొలంలో గుట్టుగా సాగు చేస్తున్న గంజాయిని పోలీసులు డ్రోన్ సాయంతో గుర్తించి శుక్రవారం దహనం చేసినట్లు అధికారులు తెలిపారు. జాతీయ రహదారికి సమీపంలోని అటవీ ప్రాంతంలో రెండెకరాలకుపైగా విస్తీర్ణంలో ఈ పంట పండిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో ఆరుగురిని అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని, సుమారు రూ.కోటి విలువైన 1,731 మొక్కలను దగ్ధం చేసినట్లు ఎస్పీ అజిత వేజెండ్ల స్పష్టం చేశారు.