కాణిపాకం వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలకు పోటెత్తిన భక్తుల రద్దీ

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ఐరాల

చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రత్యేక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే క్యూలైన్లలో భక్తులు బారులు తీరి వినాయక స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆలయ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టి అన్నదానం, తాగునీరు వంటి సకల సౌకర్యాలు కల్పించారు. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.